రంజాన్ మాసంలో దుకాణాలు నడుపుకోనివ్వండి
పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి) : పట్టణంలోని ముస్లింలు మైనార్టీ సెల్ అధ్య క్షులు సయ్యద్ మస్రత్ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన సీఐకు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు శని వారం నుంచి రంజాన్ మాసం నెల ప్రారం భమైందని ముస్లింలకు ఎక్కువగా రాత్రి సమ యంలోనే రంజాన్ మాసం పనులు ఉం టాయి. ఉదయం 3.30నిమిషాలకు సహేర్ సమయం ఉంటుంది. అందు వల్ల ఈ మాసం పురస్కరించుకొని మా యొక్క దుకానాలను నడుపుకొనుటకు మీరు అనుమతి ఇవ్వాలని సీఐని వారు కోరారు.పండ్ల షాపులు హోటల్లు రోడ్డు పక్కన నడుపుటకు మాకు అనుమతి కావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఎండి.జాకీర్ హుస్సేన్, జాహెద్ హుస్సేన్, ముస్తాక్, సాబిర్ పాషా, హాదిర్, అహ్మద్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.