రంజాన్ మాసం సందర్భంగా 24 గంటలూ తెరిచేందుకు అనుమతి
హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు, సముదాయాలు 24 గంటలూ తెరిచేందుకు అనుమతిస్తూ కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చట్టంలోని నిబంధనల ప్రకారం రోజుకి 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేసినపుడు ఆ ఉద్యోగులు, కార్మికులకు సాధారణ వేతనం కన్నా రెండింతలు చెల్లించాలని సూచించారు. సెలవుల్లో పనిచేసిన కార్మికులకు ప్రత్యామ్నాయ సెలవు ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు రాత్రివేళల్లో పనిచేసేందుకు జీవో నం.476కు లోబడి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.