” రజాకార్ల దాష్టికం… తెలంగాణ ప్రజానీకం మరువబోదు – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 14( జనంసాక్షి): తెలంగాణ ప్రాంత ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై నిజాం నవాబు ఆధీనంలోని ముష్కర మూక సాగించిన దాడులు, అరాచకాలు తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్రలో ఓ రక్తపు మరక అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానీకం మరువబోదని బిజెపి సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజల యోగానంద్ స్పష్టం చేశారు. ఈమేరకు శేరిలింగంపల్లి బిజెవైఎం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బైక్ ర్యాలీ కార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ బొటానికల్ గార్డెన్ నుండి మియాపూర్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించించడం జరిగింది. అనంతరం నిజాం సర్కారును వీరోచితంగా ఎదుర్కొని ఎందరో తెలంగాణ మహిళల ధన, మాన, ప్రాణాలను కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సామరంగారెడ్డి తో కలిసి మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవాలని ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఇందులో భాగంగానే బుధవారం తెలంగాణ విమోచన అమృత మహోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. హైదరాబాద్ ను మతోన్మాద రాజ్యాంగం గా మార్చాలనుకున్న ఖాసీం రిజ్వి నేతృత్వం లో రజాకార్లు ప్రజలపై అమానుష దాడులు, అత్యాచారాలు, దురాగతాలకు తెగబడ్డారని అన్నారు. అప్పటి తెలంగాణ ప్రాంత ప్రజలు నిజాంపై, రజాకార్లపై వీరోచిత పోరాటంచేసి తిరుగుబాటు చేశారని ఎంతోమంది ప్రాణ త్యాగాలుచేస్తే తెలంగాణాకు స్వాతంత్రం వచ్చిందని వారు గుర్తుచేశారు. తెలంగాణకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భం గా తెలంగాణా విమోచన అమృత మహోత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామమని వారన్నారు. 15 ఆగస్ట్ 1947 న భారతదేశానికి స్వాతంత్రం రావడంతో దేశం స్వేచ్ఛావాయువులు పీలుస్తూ సంబరాలు జరుపకుంటుంటే నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైన ప్రస్తుత తెలంగాణా మాత్రం ఆ సమయంలో స్వాతంత్రానికి నోచుకోలేదని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన “పోలీస్ చర్య” ఫలితంగా 17 సెప్టెంబర్ 1948 న నిజాం భారత సైన్యానికి లొంగిపోవడం ద్వారా ఆనాటి హైదరాబాద్ నిజాం కబంధహస్తాలనుండి విముక్తిచెంది, భారతదేశంలో కలిసిందిని పునరుద్ఘాటించారు. భారత స్వాతంత్ర పోరాటచరిత్రలో హైదరాబాద్ విముక్తి పోరాటం అపురూపమైన ఘట్టమని అన్నారు. 17 న పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే తెలంగాణా విమోచన అమృత మహోత్సవాలలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, ఎం.సత్యనారాయణ, ప్రభాకర్ యాదవ్, బీజేపి సీనియర్ నాయకులు పొరెడ్డి బుచ్చిరెడ్డి , బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, చందానగర్ మాజీ కార్పొరేటర్ బోబ్బా నవతా రెడ్డి, బీజేపి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, బీజేపి జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్, బీజేపి డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, రాజు శెట్టి, గొల్లపల్లి రాంరెడ్డి , శ్రీధర్ రావు, బీజేపి కాంటెస్ట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, జిల్లా OBC మోర్చా ప్రధానకార్యదర్శి శ్రీశైలంకురుమ, యస్ టీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి విజేందర్,
జిల్లాకార్యదర్శి గంగలజంగయ్య యాదవ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కుమార్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అమర్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు శివకుమార్, ఆనంద్ కుమార్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.
Attachments area