రాచెట్టికి నోబెల్‌


భారతీయ సంతతి
విశిష్ట పురస్కారం
ఒబామా ప్రశంసలువాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికా యువ ఆర్థిక వేత్త రాజ్‌ చెట్టీని ప్రతిష్టాత్మక జాన్‌ బేట్స్‌ క్లార్క్‌ పతకం వరించింది.ప్రపంచ ఆర్థిక రంగంలో నోబెల్‌ తరువాతి స్థానం ఈ పురస్కారానిదే.ఈ పతకం పొందిన ప్రతి ముగ్గిరిలో ఒకరు నోబెల్‌ అందుకుంటారని ప్రతీతి.అందుకే దీన్ని   మిగతా 2లోబుల్లి నోబెల్‌ అని పిలుస్తుంటారు.ఆర్థిక సిద్ధాంతం ,అవగాహనకు విశిష్ట సేవలందించిన 40 ఏళ్లలోపు అమెరికన్‌ నిపుణులకు ఈ పతకం అందిస్తారు.అమెరికన్‌ ఎకనామిక్‌ అసోషియేషన్‌ ఏటా ప్రకటిస్తుంది.33ఏళ్ల రాజ్‌ చెట్టి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ సంతతి వ్యక్తి .రాజ్‌ చెట్టి తల్లి దండ్రులు అమెరికాలో సిరపడ్డా కానీ ఆయన పుట్టి ,తొమ్మిదేళ్ల పాటు పెరిగిందిఢిల్లీలోనే .బార్య సుందరి కూడ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం వైద్య విభాగంలో పరిశోధన చేస్తున్నారు.హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన రాజ్‌ 2003లో పీహెడీ పూర్తి చేశారు.2009లో హార్వర్డ్‌లో ఆర్థిక శాస్త్రం ఆచార్యనిగా నియమితులయ్యారు.హార్వర్డ్‌ చరిత్రలో ఆ హోదా దక్కించుకున్న అతిపిన్నవయస్కులలో రాజ్‌ ఒకరు.రాజ్‌ చెట్టి స్థూల ఆర్థిక (మాక్రో ఎకనామిక్స్‌)రంగ నిపుణుడు.ప్రధానంగా పన్ను విధానాలు,సామాజిక బీమా ,విద్యావిధానాలపై దృష్టి సారిస్తుంటారు.అనువర్తిత స్థూల-ఆర్ధిక రంగంలో కొత్తతరం ఉత్తమ శాస్త్రవేత్త రాజ్‌ చెట్టియే! అతి తక్కువ కాలంలో ఆయన తనను తాను నిరూపించుకుంటున్నాడు.’అని అమెరికా అధ్యక్షడు బారక్‌ ఒబామా ఆయన్ని గత ఏడాది ప్రశంశించారు