రాజకీయ పార్టీల ప్రతినిధులతో తహశీల్దార్ సమావేశం
పెనుపల్లి, జులై 19(జనం సాక్షి)
ఓటు హక్కు వినియోగం, నూతన పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులుతో బుధవారం తాసిల్దార్ రమాదేవి తనకార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీ నాయకులు సలహాలు సూచనలు కోరారు. కొత్త పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడంపై రాజకీయ పార్టీ నాయకులు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓట్ల కోసం6 పామ్, ఓటును ఒకచోట నుండి మరొక చోటికి మార్చుకునేందుకు ఫామ్8 వినియోగించుకోవాలన్నారు. ఓటు తొలగింపుకు7 ఫామ్ తో ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆధారం చూపితే తొలగించవచ్చని పేర్కొన్నారు. ఈనెల 20 నుండి ఇవిఎంలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మొబైల్ సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, సిపిఎంకమిటీ సభ్యులు చలమాల విఠల్రావు, మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, కాంగ్రెస్ నాయకురాలు బుక్క కృష్ణవేణి, టిఆర్ఎస్ నాయకులు ముక్కర భూపాల్ రెడ్డి, బీఎస్పీ నాయకులు తడికమళ్ళ చిరంజీవి, బిజెపి నాయకులు బొర్రానరసింహారావు పాల్గొన్నారు.