రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాన్ని స్థానిక కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జూపాక శ్రీనివాస్, పి.మహేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై తమ సంఘం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తున్నామని అన్నారు.పీఎం మోడీ ప్రభుత్వం ప్రభుత్వం విద్యారంగంలో అశాస్త్రీయ భావజాలాన్ని నింపి మూఢనమ్మకాలు పెంపొందించే విధంగా సిలబస్ ను తయారు చేస్తుందన్నారు.నూతన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా ఉన్నత విద్యారంగమంతా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తుందని, లక్షల వెచ్చిస్తే గాని ఉన్నత విద్యను అభ్యసించే స్థితి ఉందని వాపోయారు. విద్యార్థులకు అందించే ఫెలోషిప్ స్కాలర్షిప్ లలో కోతలు విధిస్తుందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు.రాష్ట్రంలో బడులు తెరిచి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, స్కావెంజర్స్, టీచర్స్, కనీస వసతులు అందుబాటులోకి రాలేదని, దీని ద్వారా పేద విద్యార్థులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు.ప్రభుత్వ విద్యా రంగ సంస్థలను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.ఈనెల 25,26న సూర్యాపేట ఐఎంఏ ట్రస్ట్ హాల్ లో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, ప్రొఫెసర్లు, ప్రజా ఉద్యమనాయకులు తరగతులు బోధిస్తారని అన్నారు.రాజకీయ శిక్షణ తరగతులకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబొయిన కిరణ్, శ్రీకాంత్,శ్యామ్,చందర్ రావు,లింగస్వామి,సుమంత్, సాయి,అజిత్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Attachments area