రాజీనామా చేయనంటే చేయను

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌
రాజీనామా చేయబోను : శ్రీనివాసన్‌
కోల్‌కతా, మే 26 (జనంసాక్షి) :
తన పదవికి రాజీనామా చేయనంటే చేయనని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అన్నారు. ఆదివారం ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా విధి నిర్వహణలో తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని అన్నారు. దర్యాప్తులో పోలీసులకు బీసీసీఐ పూర్తి సహకరిస్తోందని, ఇకపై కూడా ఇలాంటి సహకారాన్నే అందిస్తామని అన్నారు. కొన్ని రోజులుగా కొన్ని సవాళ్లను బీసీసీఐ ఎదుర్కొంటోందన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఒక ఫ్రాంచైజీ యజమాని అయిన గురునాథ్‌ను సస్పెండ్‌ చేశామన్నారు. గురునాథ్‌ వ్యవహారంపై దర్యాప్తు కమిటీని కూడా నియమించామన్నారు. గురునాథ్‌పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించామన్నారు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో సంప్రదించవద్దని గురునాథ్‌పై ఆంక్షలు విధించామన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలను బీసీసీఐ చేపడుతుందన్నారు. తన రాజీనామాను బీసీసీఐ సభ్యులు ఎవరూ కోరలేదని తెలిపారు.