రాజోలి మండలంలో కరెంట్ కష్టాలకు చెక్

గ్రామాల ప్రజలకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి.ఇప్పటి దాకా కరెంట్ కోతలపై ఫోన్ చేస్తే సిబ్బంది లేరు అనే మాటకు కాలం చెల్లింది.రాజోలి మండల ప్రజల కష్టాలు తెలుసుకుని, ప్రస్తుతం వర్షాకాలం కావడం తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకూడదని తలిచి గౌరవ మండల అధ్యక్షులు మరియమ్మ నతానియెల్ గత కొన్ని రోజులుగా కరెంట్ అధికారుల తో తీవ్ర0గా చర్చించారు. ఏ నేపథ్యంలో వ్య వసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో గురువారం సమావేశం అయ్యి కరెంట్ కష్టాలపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయటం తో ఆయన వెంటనే విద్యుత్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు.రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులు జిల్లా S,E గారూ, భాస్కర్ కు ఫోన్ చేయటం తో మండలంలో ఉన్న విద్యుత్తు సమస్యలను mpp మరియమ్మ ఆయనకు వివరించగా వీలు అయినంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. Mpp గారు చేసిన ఈ చర్చ తో మండలంలోని ఆయా గ్రామాల్లో లైన్ మెన్లు,ఇతర సిబ్బంది తో పాటు పలు రకాల సమస్యలు పరిష్కరం కానున్నాయి. దీనిపై మండల ప్రజలు, ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు హర్షం వ్యక్తం చేశారు.