రాజౌరీలో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్‌తో దాడి, ఒకరి మృతి

జమ్మూకశ్మీర్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు, జమ్మూకశ్మీర్‌ రాజౌరీలోని బీజేపీ నాయకుడు జస్బీర్‌ సింగ్‌ ఇంటిపై దుండగులు గ్రెనేడ్‌తో దాడిచేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ దాడిలో జస్బీర్‌ మేనల్లుడు (3) మరణించాడు. మిగతా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. రాత్రి 9.30 గంటలకు జస్బీర్‌ ఇంటిలో అందరూ వరండాలో కూర్చున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఘటన స్థలంలో గ్రెనేడ్‌ పిన్ను దొరికినట్లు పోలీసులు వెల్లడిరచారు. జస్బీర్‌, ఆయన సోదరుడు బల్బీర్‌, వీరి తల్లిదండ్రులతోపాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులను రాజౌరీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. జస్బీర్‌, బల్బీర్‌లతోపాటు వీరి తండ్రి కూడా భారత సైన్యంలో పనిచేశారు. ఖాండ్లి బ్రిడ్జికి సమీపంలోని జస్బీర్‌ ఇంటిపై ఈ దాడి జరిగినట్లు జమ్మూ అదనపు డీజీపీ ముఖేశ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. అయితే, క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించడంలో వైద్యులు విఫలమయ్యారని జస్బీర్‌ మద్దతుదారులు ఆసుపత్రి బయట నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్‌ ఐజీ వివేక్‌ గుప్తా జోక్యం చేసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ‘’జస్బీర్‌ కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. తను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అందిస్తుండగా అతడు మరణించాడు. మరోవైపు ఏడు నెలల బాలిక కూడా గాయపడిరది. తనను మెడికల్‌ కాలేజీ ప్రధాన ఆసుపత్రికి తరలించాం’’అని హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మజూర్‌ హుస్సేన్‌ బీబీసీతో చెప్పారు.

తాజావార్తలు