రాజ్యాంగం ప్రమాదంలో పడిరది
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై దాడి గర్హనీయం
తీవ్రంగా ఖండిరచిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 06 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై సుప్రీంకోర్టులో దాడికి యత్నించడం తీవ్ర ఆందోళనకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటన రాజ్యాంగం ప్రమాదంలో పడిరదన్న సంకేతాలను సూచిస్తోందని తెలిపారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై సోమవారం జరిగిన ఘటనను జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా గర్హించారు. నేరుగా సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపైనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థల్ని భౌతికదాడులతో క్రమంగా బలహీనపరచాలన్నదే దీనివెనుక దురుద్దేశమన్నారు. భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించుకోవడం దేశపౌరుల కనీస కర్తవ్యంగా మారిందని ఆయన మరొకసారి గుర్తుచేశారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే భౌతికదాడులకు దిగుతామని హెచ్చరించడం స్వతంత్ర న్యాయవ్యవస్థ, దేశ సార్వభౌమాధికారంపై దాడిగానే చూడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్ బీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు
` జస్టిస్ గవాయ్‌పై దాడి యత్నం సరికాదు
` తీవ్రంగా ఖండిరచిన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రేవంత్ ట్వీట్ చేశారు. దేశ న్యాయవ్యవస్థలోని అత్యున్నత అధికారిపై దాడి చేసి బెదిరించడానికి జరిగిన దుర్మార్గపు ప్రయత్నాన్ని తాను మాటల్లో ఖండిరచలేనని చెప్పారు. ఇది మన దేశ చరిత్రలో చీకటి రోజు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇటువంటి పిరికి దాడులకు తాను భయపడబోనని ధైర్యంగా ప్రకటించిన ధైర్యవంతుడైన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ కి దేశ పౌరులతో కలిసి తాను సంఫీుభావం ప్రకటిస్తున్నట్లు రాసుకొచ్చారు..సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి చేసేందుకు ఓ లాయర్ యత్నించాడు. కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవని, తాను చలించడం లేదని, ఎవరూ ఆందోళనకు గురికావొద్దని వ్యాఖ్యానించారు. అనంతరం కోర్టులో ఉన్న లాయర్లను తమ వాదనలు కొనసాగించమని జస్టిస్ గవాయ్ కోరారు.
ఇది రాజ్యాంగంపైనే దాడి
మొత్తం షెడ్యూల్ కులాలపై దాడిగానూ చూడాలి
సీజేఐపై దాడి ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలి
కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 06 (జనంసాక్షి) :సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసిరిన చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంపైనే దాడి అన్నారు. 75 ఏండ్ల రాజ్యాంగ పాలనలో షెడ్యూల్ కేటగిరీ నుంచి అన్ని అర్హతలతో రెండోసారి సీజేఐగా జస్టిస్ గవాయి బాధ్యతల్లో ఉన్నారని గుర్తుచేశారు. న్యాయస్థానంలోనే ఆయనపై దాడికి యత్నించడాన్ని దేశంలోని మొత్తం షెడ్యూల్డ్ కులాలపై దాడిగా చూడాలన్నారు. ఇదొక్క సీజేఐ శరీరంపై జరిగిన దాడి కాదని, భారతదేశం గుండెకు గాయమని పేర్కొన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని విశ్వసించే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఘటనను ఐక్యంగా ఎదుర్కోవాలని, ఈ చీకటి మచ్చను చెరిపేసేందుకు దేశం ఐక్యంగా నిలబడాలని కోరారు.