రాజ్యాంగబద్ధంగానే పంచాయతీ ఎన్నికలు

28 లేదా 30న నోటిఫికేషన్‌ : జానా
హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) :
రాజ్యాంగబద్ధంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోసారి కేంద్రం దృష్టికి తీసు కెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తుందనే నమ్మకంతోనే తామున్నామని జానారెడ్డి పేర్కొన్నారు. హైద రాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకమాండ్‌ గడువు కోరినందునే వేచిచూస్తున్నామన్నారు. యువత బలిదానాలకు దిగవద్దన్నారు. అవసరమైతే తాము త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ ధర్మాన్ని కూడా పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. చలో అసెంబ్లీపై ఎవరి అభిప్రా యాలు వారివన్నారు. చలో అసెంబ్లీలో అవాంచ నీయ సంఘటనలు చోటుచేసుకోవడం బాదా కరమన్నారు. తెలంగాణ ప్రజల మనోభా వాలమేరకు చలో అసెంబ్లీ నిర్వహించారన్నారు. మరో సారి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలం 18న సమావేశమవుతామన్నారు. ఈనెలాఖరులో మరోసారి టీ మంత్రులు, ప్రజాప్రతినిధులం ఢల్లీికి వెళ్లి పెద్దలను కలుస్తా మన్నారు. తెలంగాణసాధన కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని