*రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాలలో జాతీయ వైద్యులు దినోత్సవం*

కోదాడ జులై1(జనం సాక్షి) ఈరోజు స్కూల్ లో సీజనల్ వ్యాధులు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు A. హనుమంతరావు,ఉపాద్యాయులు బడుగుల సైదులు విద్యార్ధుల కు సీజనల్ వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. వర్షాకాలం శీతాకాలంలో ఆరోగ్య, పరిశుభ్రత గురించి,చేతులు పరిశుభ్రత,స్నానం,ఆహారం,దుస్తులు పరిశుభ్రత గురించి తెలియ జేశారు. బయటిఫుడ్ తీసుకోరాదని, వర్షం లో బయటికి వెళ్ళవలసి వస్టే గొడుగు తీసుకెళ్లాలని, జ్వరం జలుబు దగ్గు విరేచనం అయినపుడు వెంటనే డాక్టర్ ను కలవాలని తెలిపారు.ఇల్లు బడి వీధులు పరిశుభ్రత తో ఆరోగ్యం సాధ్యమని అవగాహన కల్పించారు.ఇట్టి విషయాలను తమ తల్లితండ్రులు కు తెలియజేయమని చెప్పడం జరిగింది.