రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన

మహబూబాబాద్‌,అగస్టు3(జనం సాక్షి): జిల్లాలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇందులో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి ధ్వజ స్తంభానికి నవగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం మంత్రికి పూజారులు శాలువాతో సత్కరించి, ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఉప్పర గూడెం దేవాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆ దేవుడి కృపా కటాక్షాలు అందరిపైనా ఉండాలని కోరుకున్నారు.

తాజావార్తలు