రాయల్ తెలంగాణ వద్ద: వినయ్ భాస్కర్
వరంగల్, (జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీలు, రాయల్ తెలంగాణ వద్దు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ ఇతర ప్రతిపాదనలకు ఒప్పుకోమని స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీ నేతలది డూప్లికేట్ తెలంగాణవాదం అని విమర్శించారు. టీ టీడీపీ నేతలు చాత్తశుద్ధితో తెలంగాణ కోసం పోరాటం చేయడం లేదని పేర్కొన్నారు.