రాయికల్ మండలంలో 10 గ్రామాల్లో నూతనంగా మంజూరైన 413 పెన్షన్ ప్రొసీడింగ్స్ లను లబ్ధిదారులకు పంపిణీ
రాయికల్ మండలంలో 10 గ్రామాల్లో నూతనంగా మంజూరైన 413 పెన్షన్ ప్రొసీడింగ్స్ లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.పెన్షన్ కార్డ్ లను పంపిణీ చేసేందుకు ఎమ్మేల్యే గ్రామాల్లోకి రాగా డప్పు చప్పుళ్ళతో ,నుదుట తిలకం దిద్ది,ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్న ఆయా గ్రామాల ఆసరా పెన్షన్ లబ్దిదారులు,ప్రజలు.
అనంతరం ఆయా గ్రామాలకు చెందిన 30మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 7 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కులను,13 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 13లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు అందజేశారు…
ఎమ్మెల్యే మాట్లాడుతూ
సంక్షేమానికి అత్యధిక నిధులు వెచ్చిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే…
గతంలో కొద్ది మందికి కొంత పెన్షన్ వస్తె నేడు 90 శాతం మందికి 2 వేల పైన అందజేస్తున్న మని అన్నారు
16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా పెన్షన్ లు ఎక్కడా లేవని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గం లో 1 లక్ష 36 వేల రూపాయలు ఖాతాల్లో జమ చేశామని అన్నారు.
కుల మతం రాజకీయం తేడా లేకుండా రైతులకు రైతు బందు,భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
అన్ని కుల సంఘాల కుల వృత్తుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటగా మెడికల్ కాలేజీ అనుమతి జగిత్యాల కు వచ్చిందని రేపటి నాడు 150 మంది వైద్య విద్యార్థులు ఇక్కడ చదువుతారని 600 పడకల ఆసుపత్రి తో పాటు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని 1000 పైగా గురుకులాలు ఏర్పాటు చేసి,నాణ్యమైన విద్య బోధన భోజన సౌకర్యాలు కల్పిస్తూ ఒక్కో విద్యార్థి పై లక్ష రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తునదని అన్నారు.
ప్రైవేట్ విద్యా సంస్థలు చదివే విద్యార్థులకు సైతం 15 వేల ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు
పోటీ పరీక్షలకు బిసి, ఎస్సీ స్టడీ సర్కిల్ సైతం జగిత్యాల లో ఏర్పాటు చేశామని అన్నారు.
జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో 100 కి పైగా వైద్యులు అందుబాటులో ఉన్నారు అని ప్రతిమ నుండి 10 మంది పీజీ వైద్యులు అందుబాటులో ఉన్నారని వారికి బోజన సదుపాయం సైతం సొంతంగా కల్పిస్తున్నాను అని అన్నారు. గతంలో 17 మంది వైద్యులు మాత్రమే పరిమితం అని తేడా గమనించాలని గుర్తు చేశారు.
రైతుల కోసం 24 గంటల కరెంట్,కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ కాకతీయ,చెక్ డ్యాం లు నిర్మించామని రాష్ట్రం వచ్చాక అభివృద్ధి నీ గమనించాలని తాను వేసవిలో చెక్ డ్యాం లో జలకాలు అడిన విషయం గుర్తు చేశారు .
ముఖ్యమంత్రి గారు పేద ప్రజల పక్ష పాతి అని,అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తున్న ప్రభుత్వం ప్రజలు అండగా ఉండాలని కోరారు….
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుద్య సంధ్యారాణి సురేందర్ నాయక్, జెడ్పీటీసీ అశ్విని జాదవ్,మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్,వైస్ ఎంపీపీ మహేశ్వర రావు,యూత్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్ లు,వార్డుసభ్యులు,మండల నాయకులు,గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.