రాయికోడ్ మండల మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జన్మదిన వేడుకల్లో రక్తం పంచిన అభిమానం.

 రాయికోడ్ జనం సాక్షి 12  రాయికోడ్ మండలంలోని కుస్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిమ్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పాటిల్ పుట్టిన రోజు వేడుకలు నివాసం వద్ద ఆయన సతీమణి గ్రామ సర్పంచ్ అయిన రాధిక మరియు గ్రామస్థులతో కలిసి కేకు కటింగ్ చేస్తూ ఘనంగా నిర్వహించారు. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మండల యూవకులు గ్రామస్థులు మెగా రక్తదానం శిబిరన్నీ రుదిరా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రక్తదానం చేశారు.. ఈ పుట్టిన రోజు వేడుకల్లో మండల జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్, మండల తెరాస పార్టీ అధ్యక్షుడు భాస్వరాజ్ పాటిల్ , ఆత్మకమిటి చైర్మన్ చేవెళ్ల విట్ఠల్ పాల్గొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ.. యువత రక్తదానంలో ముందుండాలని, అన్ని ధానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. కులమతాలను చూడనిది రక్తదానం ఒక్కటేనన్నారు. అపోహలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారందరూ రక్తదానం చేయాలని కోరారు.  ఈ సందర్భంగా 35 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన బ్లడ్ బ్యాగ్ లను *రుదిరా వాలంటరీ బ్లడ్ బ్యాంక్* హిమాయత్ నగర్ కు తరలించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఉపసర్పంచ్ రాజశేఖర్ గౌడ్, పార్టీలకు అతీతంగా మండల నాయకులు యూవకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.