రావులపాలెం- .జొన్నాడ వంతెనపై నిలిచిన రాకపోకలు
రావులపాలెం : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం- జొన్నాడ వంతెనపై ఈ ఉదయం రెండు లారీలు ఢి కొన్నాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై సుమారు 5 కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్థీకరించేందుకు చర్యలు చేపట్టారు.