రాష్ట్రం ఐక్యంగా ఉండాలి: రాఘవులు

నెల్లూరు: ఆంధ్రద్రేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోకుండా ఐక్యంగా ఉండాలని సీపీఎం కోరుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ… రాష్ట్రన్ని రెండుగా చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. కాంగ్రెస్‌, తెదేపాలు తెలంగాణ సమస్యపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. రాజకీయ పార్టీలు తెలంగాణపై వారి అభిప్రాయం తెలపకపోవడంతో ప్రజల్లో విశ్వాసం కోల్పతున్నారన్నారు. తమ పార్టీ మాత్రం రాష్ట్రం ఒకటిగా ఉండాలని కోరుకుంటుందని స్పష్టంచేశారు. తెలంగాణ సమస్య వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలపై అదనంగా రూ.14వేల కోట్ల భారం పడుతుందని వివరించారు. దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంలో 26 బివోలను జారీచేసి అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులను విచారించి మంత్రి వర్గంనుంచి తొలగించాలని రాఘవులు డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు