రాష్ట్రపతి ఎన్నికల్లోపే తెలంగాణ ఇవ్వాలి
కరీంనగర్,జూలై 14(జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికలో్లప తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ వెంకట రాజు, ఎడవేన రమేష్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ కోర్ కమిటి చైర్మన్ గా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఏ ఒక్క రోజు కూడ తెలంగాణ పట్ల సానుకూల వైఖరి వ్యక్తం చేయలేదు. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్తిగా పోటీ చేస్తున్నందున తెలంగాణాలోని ఎమ్మేల్యేలు, ఎంపిలు ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు