రాష్ట్ర గవర్నర్ తమిళీసై సుందర రాజన్ కలిసిన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ

 
మహబూబాబాద్ రూరల్ డిసెంబర్ 19 (జనం సాక్షి):   జిల్లా నలుమూలల నుండి లంబాడీల  ఐక్య వేదిక పది మంది తో కుడిన  రాష్ట్ర కమిటీ  “ఐక్య వేదిక రాష్ట్ర ప్రతినిధి”  బృందంతో  రాష్ట్ర గవర్నర్ తమిళీసై సుందరరాజన్  ని
ఈ రోజు 19/12/2019 నాడు,  సమయం 11:30 లకు కలిసి ముఖ్యం జనాభా దామాషా గిరిజన రిజర్వేషన్” ల అమలు,
1 లంబాడీల మాతృ భాషా  *గోర్ భోలి* గుర్తింపు.
2 గవర్నర్ ఆధ్వర్యంలో *ట్రైబల్ అడ్వైసరి కౌంసిల్* నిర్వహణ.
3. రెవెన్యూ తండా పంచాయతీ గుర్తింపు
 ప్రత్యేక
4.  మైదాన ప్రాంతల అమలు.
5.  ప్రత్యేక తండా, గూడాల *డెవలప్మెంట్ భోర్డు*.
6.  గిరిజన *సబ్ ప్లాన్ నిదులను*  దారి మల్లించకుండా  గిరిజన అబివృద్దికై వినియోగం.
7.  గిరిజన లంబాడీ ఆరాద్య దైవం *సేవాలాల్ మహారాజ్, మరియు తీజ్* పండుగలకు సెలవు రోజులు.
8.  గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితిలపై దృష్టి.
9.  లంబాడీ గిరిజన ప్రాంతాల్లో ఆడపిల్లల అమ్మకం నిర్మూలన చర్యలు.
 ముఖ్యంగా  కొంత తమ స్వార్థ  రాజకీయల కోసం లంబాడీల పై జరుగుతున్న *”అసత్య ప్రచారం”* చేస్తూ *గోండు,కోయ లంబాడి, ఏరుకల, యానాది మధ్య వైరం శృష్ఠీంచే వారిని కట్టుబడి చేయడం గురించి చర్చించేందుకు  “లైవ్ లంబాడీల ఐక్య వేదిక” లక్డీకపూల్  కేంద్ర కార్యాలయం నుంచి రాజ్ భవన్ కి బయలు దేరటం జరిగింది.