రాష్ట్ర ప్రభుత్వం అచేతన స్థితికి చేరింది.
హైదరాబాద్: హక్కులను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం అచేతన స్థితికి చేరిందని వామపక్షాలు విమర్శించాయి. ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు జైలు శిక్ష పడ్డ మంత్రి రాజీనామా చేయకుండా ఉంటే బర్తరఫ్ చేయకుండా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణ ప్రశ్నించారు. నైతికంగానూ, చట్టపరంగానూ మంత్రి తన పదవిలో కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి గ్యాస్ వాటా రాబట్టు కోవడంలోనూ, వైద్య సీట్లు సాధించుకోవడంలోనూ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే నిబంధనలు సరిగా లేవంటూ ఎంసీఐ సీట్లు ఇచ్చేందుకు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మండి పడ్డారు. అవగాహనలేని వ్యక్తి వైద్యశాఖ మంత్రిగా ఉండటం సిగ్గుచేటని నారాయణ విమర్శించారు.