రాహుల్ ట్విట్టర్ అకౌంట్ నిలిపవేత
నిరసన తెలిపిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు
న్యూఢల్లీి,ఆగస్ట్9(జనంసాక్షి): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఖాతాపై ట్విటర్ సంస్థ తాత్కాలికంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్‌ఎస్‌యుఐ ఆందోళనకు దిగింది. పలు రాష్టాల్ల్రో కార్యకర్తలు దర్నాలు, ర్యాలీఉ చేపట్టారు. రాహుల్‌గాంధీ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారని.. దీంతో ఆయన ఇతర సోషల్‌విూడియా వేదికల్లో ప్రజల తరపున తన గొంతుకను వినిపిస్తారని కాంగ్రెస్ పేర్కొంది. ఢల్లీిలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాహుల్ అనంతరం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడతానని ట్వీట్ చేశారు. వారిని పరామర్శించిన ఫొటోలను కూడా జత చేశారు. అయితే బాలిక మైనర్ కావడంతో నిబంధనలకు విరుద్ధంగా ఆ కుటుంబం ఫొటోలను పోస్ట్ చేశారంటూ ట్విటర్ సంస్థ పోస్ట్‌ను తొలగించింది.
అయితే కేంద్రం ఒత్తిడితోనే ట్విటర్ సంస్థ రాహుల్ ఖాతాను తొలగించిందని ఎన్‌ఎస్‌యుఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విటర్ ఇండియాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. స్థానిక ట్విటర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు. ’మై బీ రాహుల్ ’ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు పోస్టులు షేర్ చేస్తూ.. కేంద్రం, ట్విటర్‌పై దాడి చేశారు. మైనర్ బాలిక కుటుంబం ఫొటోను షేర్ చేసిన రాహుల్ పై చర్యలు తీసుకున్నారు కాని .. అదే ఫొటోను షేర్ చేసిన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్‌పై ఎటువంటి చర్య తీసుకోలేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బిజెపి ఎంపి, ఎస్‌సి కమిషన్ సభ్యుడు కూడా ఈ నెల 3న బాధితురాలి ఫొటోను షేర్ చేశారని.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, విూడియా ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. దళిత బాలికకు న్యాయం జరిపించడానికి బదులుగా కేంద్రం వారికి మద్దతు తెలిపిన వారి గొంతుకను నొక్కేస్తోందని అన్నారు.