రిజర్వేషన్‌కు కట్టుబడ్డాం

` కాంగ్రెస్‌ చేసిన చట్టాలకు ఎన్డీయే తూట్లు పొడిచింది
` ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీన పరిచారు
` ఆర్టీఐను నీరు గార్చేందుకే కమిషనర్‌ పోస్టులను భర్తీ చేయట్లేదు
` దూరదృష్టితో యూపీఏ ప్రభుత్వం సమచారహక్కు చట్టం తీసుకొచ్చింది :
` టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్‌లకు కట్టుబడి ఉన్నామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.కాంగ్రెస్‌ తీసుకొచ్చిన గొప్ప చట్టాలకు ఎన్డీయే ప్రభుత్వం తూట్లు పొడిచిందని అన్నారు. ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీన పరిచారని మండిపడ్డారు. ఆర్టీఐను నీరు గార్చేందుకే కమిషనర్‌ పోస్టులను భర్తీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో 11 మంది ఆర్టీఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని చెప్పారు. ఆర్టీఐ తీసుకొచ్చి 25 ఏళ్లయిన సందర్భంగా దాని గొప్పతనం తెలియజేయాలనుకున్నామని పేర్కొన్నారు. దూరదృష్టితో యూపీఏ ప్రభుత్వం సమచారహక్కు చట్టం తీసుకొచ్చిందన్నారు.