రిజర్వేషన్ తేలితేనే ‘స్థానిక’ ఎన్నికలు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (జనంసాక్షి) :
రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తికాగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడుతల్లో నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.