రిస్కు తీసుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు

4

– విద్యార్థులతో ముఖాముఖిలో సుందర్‌ పిచాయ్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి): రిస్క్‌ తీసుకోవడానికి ముందుకు రావాలని విద్యార్థులకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పిలుపునిచ్చారు.రిస్కు తీసుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. అకడమిక్‌ చదువుల కంటే క్రియేటివిటీ ముఖ్యమని పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని శ్రీరాం కాలేజీ విద్యార్థులతో ముఖాముఖిలో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… విద్యార్థులారా కాసింత రిస్క్‌ తీసుకోండి. రిస్క్‌ వల్ల ఇబ్బందులతో పాటు విజయం కూడా వస్తుందని సూచించారు. వారు వేసిన ప్రశ్నలకు ఓపికగా సామాధానం ఇస్తూనే తన అనుభవాలను, ప్రణాళికలను వారితో పంచుకున్నారు.  వచ్చే తరానికి క్రియేటివిటీ అన్నదే ప్రధానాంశం. చదువుల కంటే సృజన ముఖ్యం. ఉద్యోగాలు చేయడం గురించి కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా ఆలోచనలు ఉండాలని వారికి హితవు పలికారు.  చదువైపోగానే ఓ కొత్త కంపెనీ ప్రారంభించాలన్న తపన ఉండాలి. ఇండియాలో స్టార్‌ ఆప్‌ కల్చర్‌ పెరుగుతోంది. దేశంలో ఎంతమంది డెవలపర్లు ఉంటే అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. పాఠశాలల్లో కోడింగ్‌ ను తప్పనిసరి చేయాలి  అన్నారు. ఇండియా చాలా మారిందని అంటూ సిలికాన్‌ వ్యాలీకి, ఢిల్లీకి తేడా లేదని పేర్కొన్నారు. గూగుల్‌ అద్భుతాల కేంద్రమని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు పిచాయ్‌ సమాధానం ఇచ్చారు. భారత్‌పై తనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉందని వెల్లడించారు. టీ20 మ్యాచ్‌లపై తనకు అంతగా ఆసక్తి ఉండదని.. వన్డే, టెస్టు మ్యాచ్‌లను ఎక్కువగా ఆస్వాదిస్తుంటానని అన్నారు. గూగుల్‌లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు మిఠాయి దుకాణంలో చిన్నపిల్లాడు అడుగుపెట్టినట్లు అనిపించిందని తన అనుభవాన్ని తెలిపారు.  గూగుల్‌ అద్భుతాల కేంద్రమని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. హర్షబోగ్లే కామెంటేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పిచాయ్‌ ఇచ్చి వారిని ఉత్తేజితులను చేశారు.  క్రియేటివిటీ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందని,భారతీయ విద్యా వ్యవస్థ దాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందన్నారు.  అందు వల్లనే ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు సవాళ్లను స్వీకరించి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. కలల్ని సాకారం చేసుకోడానికి ఎవరైనా ప్రయత్నించాల్సిందేనని అన్నారు. కొందరు పోన్‌ ఎప్పుడు కొన్నారన్న దానికి సమాధానమిస్తూ 1995-96లో నా మొదటి మోటరోలా ఫోన్‌ని కొన్నాను. స్మార్ట్‌ ఫోన్‌ అయితే 2006లో.అలాగే రాణించడానికి  ఎవరి మనసు చెప్పింది వారు ఫాలో అయితే చాలు. గూగుల్‌ ప్రధాన కార్యాలయం ఉన్న సిలికాన్‌ వ్యాలీలోకొత్తగా సంస్థ పెట్టడం, అది విఫలమవడం రెండూ గౌరవంగానే ఉంటాయన్నారు.  స్టూడెంట్‌ డెవలపర్లకు సహకరించేందుకు గూగుల్‌ ఎందుకు ముందుకొచ్చిందన్న దానికి మాట్లాడుతూ  చాలా దేశాల్లో కంటే భారత్‌లో విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంది. అలాంటి వారిలో 20లక్షల మంది విద్యార్థులకు శిక్షణనిచ్చి వారిని ఉత్తమ డెవలపర్లుగా తయారుచెయ్యాలని గూగుల్‌ భావిస్తోంది. అందుకోసం ఇక్కడ 30 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కూడా చేసుకున్నాం అని అన్నారు.  తాను ఎక్కువగా ఫుట్‌బాల్‌ అభిమానిని. నేను పుట్టి పెరిగే సమయంలో టీ20 లేదు. అందువల్లనేనేమో టెస్టు, వన్డే క్రికెట్‌ని ఆస్వాదించినంతగా టీ20ని ఆస్వాదించలేను. మొదట గావస్కర్‌కి ఆ తరువాత సచిన్‌ తెందుల్కర్‌కి నేను అభిమానిని అంటూ తన క్రీడాభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్‌ సీఈఓ కాకపోయి ఉంటే భవిష్యత్తు కోసం సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌ని తయారుచేస్తూ ఉండేవాడిని. వాటి గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని. అవి చెయ్యడమే నాకిష్టం అన్నారు. భారత్‌లో స్టార్టప్‌ కల్చర్‌పై.. మాట్లాడుతూ  గతేడాని నేను ఇక్కడికి వచ్చేప్పటికే ఇక్కడ స్టార్టప్‌ల సంస్కృతి బాగా వచ్చేసింది. ఎందుకంటే స్మార్టప్‌లకు కావల్సినవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.  భారత్‌లో డ గ్రావిూణ ప్రాంతాల్లో మహిళలు అసలు ఇంటర్నెట్‌ గురించే ఆలోచించరని, అలాంటి వారిని ఆన్‌లైన్‌లోకి తేవడానికి గూగుల్‌ కృషి చేస్తోందన్నారు. భారత్‌లో ఈ ఏటి ట్రెండ్స్‌ ఏంటో తెలుసుకోవాలంటే గూగుల్‌లో ఏం వెతికారో తెలుసుకుంటే చాలన్నారు.  యువత వేటిపై ఆసక్తిగా ఉన్నారు, ఏ వస్తువులకు, వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు తదితర విషయాలన్నీ వారు సెర్చ్‌ చేసిన అంశాలను బట్టి ఇట్టే తెలిసిపోతాయన్నారు.  అలా 2015 ఏడాది మొత్తంలో భారత్‌లో నెటిజన్లు శోధించిన అంశాల్ని క్రోడీకరించి గూగుల్‌ జాబితాను విడుదల చేసింది.