రూపాయి బలహీనతతో ఎన్నాళ్లు వేగగలం

ఎగుమతిదిగుమతులపై సవిూక్షించుకోవాల్సిందే
ఆహరాధాన్యాల ఎగుముతలు పెరిగితేనే వృద్ది
న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం ఎప్పటికీ బలహీనంగానే ఉంటున్నాం. బలహీన దేశాలైన సూడాన్‌ లాంటి దేశాల్లో మాత్రమే మనం బలవంతులం. 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ వెనక్కి తిరిగి చూస్తే మన ఆర్థిక ప్రగతి బలపడిరదా లేక బలహీన పడిరదా అన్నది రూపాయిని అడిగితే చెబుతుంది. ప్రధానంగా మనం రూపాయిని డాలర్‌తో పోలిస్తేనే మన బలం గురించి తెలుస్తుంది. డాలర్‌ మనకు అందనంతగా ఎదిగి పోతోంది. ఇది డాలర్‌ బలమో లేక మన రూపాయి బలహీనతో కానీ పాలకులు మాత్రం ఘనంగా అభివృద్ది గురించి ఢంకా బజాయిస్తున్నారు. ఆహారధాన్యాల దిగుబుడుల పెరిగినందున ఎగుముతలకు ప్రోత్సాహం ఇవ్వాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే వంటనూనెలు, పప్పుధాన్యాల దిగుమతులను సవిూక్షించాలన్నారు. అంతెందుకు నోట్ల రద్దు జరగక ముందు ఉన్న వేయి విలువ ఇప్పుడు కొత్త రెండు వేల నోటుకు లేదంటే నమ్మగలమా? కానీ నమ్మాలి. ఆనాటి వేయి నోటు ఇవాళ్టి రెండువేల నోటు కన్నా బలహీనమే అన్న సంగతి బజారులో అడుగు పెడితే సామాన్యుడే చెబుతాడు. వివిధ సంక్షేమ పథకాల్లో దాదాపు 6 కోట్లమంది లబ్ధిదారులు లేకున్నా ఉన్నట్లు చూపించి ఇన్నాళ్లు ప్రజాధనాన్ని మింగేశారు. మేం వచ్చిన తర్వాత అవినీతి, నల్లధనాన్ని అరికట్టి సుమారు
రూ.90వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసి దాన్ని పేదల అభివృద్ధికోసం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు దిల్లీ వీధుల్లో అధికార దళారులు లేకుండా చేశాం. ప్రభుత్వ విధానాలు మార్పిస్తామని చెప్పుకొని తిరిగేవారి దుకాణం మూతపడిరది. బంధుప్రీతి లేకుండా చేశాం. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు 3 లక్షల డొల్లకంపెనీలకు తాళాలు వేసి వాటి డైరెక్టర్లపై చర్యలు మొదలు పెట్టాం. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన చివరి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తావించిన అంశాలు ఇవి. ఇంకా తన ప్రభుత్వం సాధించిన విజయాలను, చేపట్టిన సంక్షేమ పథకాలను, సంస్కరణలను వివరించారు. ప్రతి భారతీయుడికి ఇల్లు, విద్యుత్తు, గ్యాస్‌, నీరు, మరుగుదొడ్డి, నైపుణ్యాభి వృద్ధి, వైద్యం, బీమా, అనుసంధానం అన్న మంత్రాన్ని తీసుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్తా మని చెప్పారు. దళితులు, ఓబీసీలు, మహిళలకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేసింద న్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ద్వారా దేశం సరికొత్త అవకాశాలను అందుకొనేలా చేస్తానన్నారు. ఇన్ని చెప్పిన ప్రధాని మోడీ మన రూపాయికి శస్త్రచికిత్స చేసే విషయాన్ని మరచిపోయారు. ఆరోగ్యపథకం అందిస్తున్న వేళ దానికి వచ్చిన బీమారీ గురించి పట్టించుకోలేదు. రూపాయి రోజురోజుకూ చిక్కి శల్యమవు తున్నా ప్రస్తావించలేదు. కాంగ్రెస్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు మోడీ అద్భుతాలు చేసేస్తారన్న భావనతో బిజెపిని గద్దెనెక్కించారు. అయితే, ఈ ఏడేళ్ల మోడీ పాలనలో రూపాయి విలువ పెరగలేదు సరికదా మరింత దిగజారింది. కనీసం ఆనాటి స్థాయిలో వున్నా కొంత నయం అనుకునే పరిస్థితి ఏర్పడిరది. నిజంగా రూపాయికి శస్త్రచికిత్స చేసే కార్యాక్రమాలు కానరావడం లేదు. చదువు కునేందుకు వెళ్లే పిల్లలకు రూపాయలను బస్తాల్లో పంపినా అక్కడ పిడికెడు డాలర్లు రావడం లేదని వాపోతున్నారు. డెబ్భయి ఐదేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారిపోయి రూపాయి విలపిస్తుండగా, నిత్యావసరాల ధరలు పెరిగి, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరు ఎక్కడా ప్రధాని మోడీకి కానరావడంలేదు. 1947లో రూపాయి విలువ డాలర్‌తో సమానం. అంటే ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో మనం బాగా అభివృద్ది సాధించామని ఈ రకంగా పోల్చుకోవాలేమో. ఇంతటి బలహీనమైన రూపాయి ఎప్పుడు బలపడుతుందా అన్నదే అనుమానం. ప్రధాని మోడీ ఇప్పుడు ఈ దిశగా దృష్టి సారించాలి. కఠిన పరిశ్రమ చేయాలి. ఎగుమతులు,దిగుమతులను విశ్లేషించాలి. తాము తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వడం లేదని గుర్తించి అందుకు కారణాలు విశ్లేషించాలి.