రూ.10లక్షలు గల టైర్లు చోరీ
మత్తెవాడ: పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టైర్ల దుకాణానికి చెందిన తలుపులను రాడ్లతో విరగ్గొట్టి 51టైర్లను ఎత్తుకెళ్లారు. క్రైం ఎస్పై కోటీశ్వరరావు కథనం ప్రకారం హన్మకొండకు చెందిన అశోకరెడ్డి టైర్ల దుకాణానికి తాళం వేసి వెళ్లగా, ఉదయం వచ్చేసరికి దుకాణం తెరచి ఉంది. దీంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ టైర్ల విలువ రూ.10లక్షలు ఉంటుందని అంచనా.