రూ.399 లతో సామాన్యుడికి 10 లక్షల బీమా.

కోటగిరి అక్టోబర్ 22 జనం సాక్షి:-నేటి సమాజంలో సామాన్య మానవుడు ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవాలంటే గగనంగా మారింది.
ప్రతి ఒక్కరికీ రెప్పపాటు సమయంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.ఈ క్రమంలో (ఐపిపిబి) ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు కలిగే యాక్సిడెంటల్ పాలసీని ప్రవేశపెట్టారు.కోటగిరి మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ఆవరణంలో పోస్ట్ మాస్టర్ గంగాధర్ పలువురుకి ఈ పాలసీ ప్రయోజనాల గురించి వివరించారు.ఈ పాలసీ తీసుకోవాల్సిన వారు ఐపిపిబి ఖాతాదారులై 399 ప్రీమియంతో రూ.10 లక్షల వరకు యాక్సిడెంట్ బీమా కవరేజ్ పొందవచ్చు.ఈ పథకానికి 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు వారు అర్హులు.ఈ పాలసీ ఖాతాదారులు ప్రతి సంవత్సరం పాలసీని రెన్యువల్ చేసుకోవాలి.ఈ సందర్భంగా ఐపిపిబి యాక్సిడెంట్ పాలసీ మొక్క ప్రయోజనాలపై కోటగిరి ఎస్.ఓ గంగాధర్ మాట్లాడుతూ ఈ యాక్సిడెంటల్ పాలసీదారులు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన,శాశ్వత అంగవైకల్యం చెందిన,పక్షవాతానికి గురైన,ఏదైనా అవయవం కోల్పోయిన రూ.10 లక్షల వరకు పరిహారం పొందవచన్నారు.ప్రమాద శత్తు పాలసీ దారుడు ఏదైనా ప్రమాదానికి గురై చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరితే అతనికి ఇన్ పేషంట్ క్రింద ఐపిపిబి రూ.60 వేలు,ఔట్ పేషెంట్ కింద రూ.30 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు.రూ.399 ప్రీమియం గల పాలసీదారులకు ఈ పాలసీలో 10% వరకు వారికి సంబంధించిన ఇద్దరు పిల్లల చదువు కొరకు 1లక్ష ఇవ్వడం జరుగుతుందన్నారు .ప్రమాద శక్తు పాలసీదారుడు ప్రమాదానికి గురై హాస్పిటల్లో చేరితే అతనికి రోజువారీ చికిత్స నిమిత్తం 1000 రూపాయల చొప్పున 10 రోజులు హాస్పిటల్ ఖర్చులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఆ పాలసీదారుడు మరణించిన అతని అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు.ఎవరైనా ఈ పాలసీని పొందాలనుకునే వారు స్థానిక పోస్టల్ ఆఫీసులో ఆధార్ కార్డ్,సెల్ ఫోన్ తో సంప్రదించ గలరని కోరారు.

Attachments area