రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు
(మంగళవారం తరువాయి భాగం)
ఆ పత్రాలలోనూ చర్చలోనూ ఎన్నో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటినీ వివరించడం ఒక్క వ్యాసంలో సాధ్యం కాదు. ఈ పత్రాలలో ఎక్కువ భాగం భారత ఉత్పత్తి విదానం పెట్టు బడిదారీ విధానమని, అర్థవలస అర్థ భూస్వామ్య సూత్రీకరణ అర్థర హితమని వాదించాయి. భారత సమాజం అర్ధ భూస్వామ్య అర్థ రహి తమని వాదించాయి. భారత సమాజం అర్థభూస్వామ్య అర్ధ వలస దశలోనే ఉన్నదని, పెట్టుబడిదారీ విధానం వచ్చిందనే వాదనలు దృగ్గోచరాంశాల రూపాన్ని మాత్రమే చూస్తున్నాయని, సారంలోకి వెళ్లడం లేదని కొందరు వాదించారు. ఈ రెండు భిన్న దృక్పధాలు మాత్రమే కకాక, మార్క్సిజం గురించి, భారత చరిత్ర గురించి, భారత కమ్యూనిస్టు ఉద్యమం గురించి కూడ ఎన్నో ఎన్నో అభిప్రా యాలు వెలువడ్డాయి. మొత్తం మీద రెండు రోజుల చర్చాక్రమంలో వెలువడిన ముఖ్యమైన, ఆలోచించవలసిన వాదనలను నాటుగు రకాలుగా వర్గీకరించవచ్చు: 1. అసలు మార్క్సిస్టు చారిత్రక భౌతిక వాద చట్రానికి పరిమితులున్నాయనీ, పాత సంవిధానాలు సరిపోవ నీ చేసిన వాదనలు. 2. బారతదేశానికి, భారత విప్లవానికి సంబం ధించిన స్థూలమైన అవగాహనలు. 3. దేశంలో ప్రస్తుతం కొససా గుతున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలు 4. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నది అర్థభూస్వామ్య అర్థవలస సమాజం అనే వాదనలు. వీటిలో మొదటి రెండు అంవాలలో భిన్న మైనర,పరస్పర విదుద్ధమైన అభిప్రాయాలు, మూడవ వాదనలలో నాలుగో వాదనకు ఖండనలు, నాలుగో వాదనలలో మూడు వాదనకు ఖండనలు వెలువడ్డ ఆ వాదనలలో కొన్ని స్థూలంగా ఇలా ఉన్నాయి.
‘పాత సంవిధానాలు పనికిరావు’
– సమాజ స్వభావం గురించి చర్చ విశ్లేషణాత్మకంగా ఉండాలి, వివరణాత్మకంగా మాత్రమే ఉంటున్నది.
– పునాది ఉపరితలం చట్రంలో సమాజాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, ప్రస్తుత సమాజంలో వ్యవస్థేతర అంశాల ప్రాధాన్యత పెరిగిపోతున్నది.
– ఇవాళ అంతర్జాతీయ శ్రమ విభజన జరుగుతున్నది, పాత తరహా పెట్టుబడిదారీ అభివృద్ది కథనం చెల్లదు.
– కార్మికీకరణ ప్రత్యక్షంగా మాత్రమే కాదు, పరోక్షంగా కూడా జరుగుతున్నది.
– సంక్షేమ రాజ్యం ఉనికిలోకి వచ్చిన తర్వాత ఉత్పత్తి విధాన పరివర్తనను పాత పద్దతిలో చూడలేము.
– ప్రస్తుత సమాజంలో ఉత్పత్తి సామాజికీకరణ ఎక్కువయింది. శ్రమ కేంద్రికరణ లేదు. అటువంటప్పుడు పాత కార్మికవర్గ సిద్దాంతాలు పనికి వస్తాయా?
– చారిత్రక భౌతిక వాదం చెప్పిన దశలను భారతదేశానికి యాంత్రికంగా వర్తింపజేయగలమా?
– పంపిణీ ప్రక్రియ ప్రాధాన్యత పెరుగుతున్నది. దీనితో పాటే ఉత్పత్తిలో మభ్యపెట్టడం, జరిగినట్లు ఉన్నా నిజంగా జరగకపోవ డం, చూడడానికి ఉన్నట్టే ఉండి, అసలు ఉండకపోవడం వంటి ప్రక్రియలు ఉన్నాయి.
– సైనికీకరణ వల్ల ఏర్పడే, పెరిగే మార్కెట్‌ను పరిగణలోకి తీసుకో వాలి.భారత సమాజానికి, విప్లవానికి సంబంధించిన స్థూలమైన అవగా హనలు
– అసలు విభిన్న జాతుల నిలయమైన భారతదేశాన&ఇన ఒకే సమాజంగా చూడవచ్చా? ఇందులో ఎన్నో విభిన్న ఉత్పత్తి విధానాలు ఉన్నాయి. శ్రమను అమ్ముకునే వాళ్లలోనే ఎన్నో అంశాలు ఉన్నాయి.
– భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిజమైన ప్రత్యామ్నాయం కాకుండా సామ్రాజ్యవాదం కుట్ర చేస్తున్నది.
– భారత సమాజంలో వర్గం కన్న ఇతర అస్తిత్వాలు ప్రధానంగా మారుతున్నాయి.
– భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ బలంగా ఉంది. ప్రజల్లో దానికి ప్రాధాన్యత ఉంది.
– భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యక్రమం కనబడని ఇద్దరు శత్రువుల మీద పోరాడ మని ప్రజలకు పిలుపు ఇస్తున్నది. ఇప్పుడు భూ స్వామి ఎక్కడున్నాడు? సామ్రాజ్యవాది ఎక్కడున్నా డు?
– అసలు భారత సమాజంలో భూమి సమస్యే లేదు. మన సిద్దాంత చట్రంలో సామాజిక వాస్తవికతను బిగించి తృప్తి పడుతున్నాం.
– రూపొందుతున్న రైతాంగ వ్యవసాయాన్ని పరిరక్షించడమే వ్యవసాయ విప్లవ కర్తవ్యం.
– దేశమంతా ఒకే ఉత్పత్తి విధానం లేదు, ఎన్నో ఉత్పత్తి విధానాలు ఉన్నాయి. వాటిలో ఏది పెరుగుతున్నదో, ఏది తరుగుతున్నదో చూడాలి.
– తెలంగాణలో మావోయిస్టుల వైఫల్యమే అర్థభూస్వామ్య సిద్దాంతానికి కాలం చెల్లిందనడానికి రుజువు
– చత్తీస్‌గడ్‌లో జరుగుతున్నది భారత ప్రభుత్వంలో వర్గవైరుధ్యం కాదు.
‘పెట్టుబడిదారీ విధానం ప్రవేశించింది, బలపడింది’
– భౌతిక పరిస్థితి మార్పు లేకుండా ఉండదు, 1947లో ఉన్నట్టే, 1969లో ఉన్నట్టే ఇప్పుడు ఉందనడం కుదరదు. పెట్టుబడిదారీ విధానం రాక తప్పదు, వచ్చింది.
– అరవై సంవత్సరాలుగా బూర్జువా రాజ్యాంగయంత్ర ఉపరితలం పునాది మీద ప్రభావం వేసింది.
– పెట్టుబడిదారీ దోపిడీ, భూస్వామ్య పీడన ఉన్నాయి.
– వ్యవవసాయంలో పెట్టుబడిదారీ విధానం లేకుండానే, వ్యవసాయేతర రంగాలలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది. ప్రభుత్వ రంగంలో అభివృద్ది భావజాలం కింద పెట్టుబడిదారీ విధానం వచ్చింది. ప్రభుత్వ రంగంలో అభివృద్ది భావజాలం కింద పెట్టుబడిదారీ విధానం అభివృద్ది అయింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ అబివృద్ది కూడాయ బూర్జువావర్గానికి సహాయపడేందుకే సాగింది.
– ప్రధాన ఉత్పత్తి విధానంగా ఉన్నది సరుకుల విధానమే, పెట్టుబడిదారీ విధానమే..
– స్వేచ్చాశ్రామికులు ఆవిర్భవించారు.
– మార్క్స చేసిన కౌలు రూపాల చర్చను భారతదేశానికి అన్వయిస్తే ప్రస్తుత ద్రవ్యరూప కౌలు స్థితి పెట్టుబడిదారీ విధానం ఉందనడానికి సూచికే.
– సరళ సరుకుల ఉత్పత్తి విధానం విస్తృత సరుకుల ఉత్పత్తి విధానంగా మారేటప్పుడు రైతాంగాన్ని ఊచకోత కోయకతప్పదు. లక్షలాది చిన్న రైతుల ఆత్మహత్యలు ఆ ఊచకోతలో భాగమే.
– స్వతంత్ర పెట్టుబడిదారీ వర్గం బలపడడానికి పాలకవర్గం కృషి చేసింది. మొదటి ఇరవై ఏళ్లలో బడాబూర్జువా వర్గం అభివృద్ది చెందింది.
– పట్టణీకరణ పెట్టుబడిదారీ విధాన చిహ్నమే.
– ఆహారధాన్యాల ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగడం పెట్టుబడిదారీ విధాన ఫలితమే.
– వ్యవసాయరంగపు వాటా పెట్టుబడిదారీ దేశాల్లోలాగనే ఉంది.
– భూస్వామి, పెట్టుబడిదారులలో ఎవరు తల, ఎవవరు తోక? ఎవరు పురోగామి. ఎవరు మార్గదర్శి, ఎవరు అనుమాయి?
– గుడ్లు, పాలు వంటి వస్తువులు కూడా సరుకుఉగా మారి పోతున్నాయి.ఔ
– అర్థవలస అంటున్నామంటే ఆమేరకు బూర్జువా వర్గం వచ్చినట్టే.
– సాఫ్ట్‌వేర్, హైటెక్నాలజీ రంగాలు వచ్చాయంటే ఉన్నతస్థాయి చైతన్యం వచ్చినట్టే కదా? సాఫ్ట్‌వేర్‌లో అదనపు విలువ ఎక్కువగా పోగుపడుతున్నది కదా?
– సహజ ఆర్ధిక వ్యవస్థలో విద్యుచ్చక్తి పాత్ర ఉండదు. ఇది ఇంకా అర్థభూస్వామ్యమే అయితే విద్యుచ్చక్తిఇంత ప్రధానం ఎలా అవుతున్నది?
– వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సాధానాల వినియోగం విపరీతంగా పెరిగింది. 1951లో 8,500 ఉన్న ట్రాక్టర్లు 1997 నాటికి ఇరవై లక్షలకుపైగా పెరిగిపోయాయి. భూస్వామ్య ఆధిపత్యం ఉంటే ఈ యాంత్రీకరణ సాధ్మమేనా?
– ఇతర రంగాలు వ్యవసాయ రంగాన్ని వలసగా చూస్తూ దోపిడీ చేస్తున్నాయి.
– దున్నే వారికే భూమి నినాదానికి కాలం చెల్లింది.
– దున్నేవారికే భూమి, మౌళిక భూపంపిణీ కార్యక్రమాలు మార్క్సిస్టు వ్యతిరేకమైనవి.
– రైతు వ్యవసాయాన్ని పరిరక్షించడం పెట్టీ బూర్జువా ధోరణీ.
– వ్యవసాయ రంగం మొత్తంగా మార్కెటీకరణ చెందింది. అదే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి నిదర్శనం.
– రకరకాల భూస్వామ్య విధానాలు, రకరకాల పెట్టుబడిదారీ విధానాలు ఉన్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా మార్పులు, పరివర్తనలు వచ్చాయి. అక్కడెక్కడో ఉన్నట్టుగా ఇక్కడ లేదు గనుక ఇది పెట్టుబడిదారీ విధానం కాదు అనలేము.
– భారతదేశపు ప్రత్యేకతలతోనైనా, పెట్టుబడిదారీ వ్యవస్థ కళ్లముందర కనబడుతున్నది. బడా గుత్తాధిపత్య బూర్జువా వర్గం కొన్నచోట్ల, ధనిక రైతాంగ బూర్జువావర్గం కొన్నిచోట్ల ఉంది. ఇది అంతర్గతంగా వచ్చిన పెట్టుబడే. దీన్ని విస్మరించడానికి వీలులేదు.
– గత మూడు దశాబ్దాలలో ప్రాథమిక సంచచనం ఎక్కువగా జరుగుతోంది. టాటాలు బైటికి వెళ్లి కోరస్‌ను కొన్నారు. అంటే భారతదేశంలో వేరే రకమైన పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ది చెందుతున్నదా, లేక ఇంకా అర్థవలస అర్థభూస్వామ్య వ్యవస్థేనా? కళ్లకు ఒకటి కనిపిస్తోంది. సిద్దాంతీకరణ మరొకరకంగా ఉంది.
– ఎస్ వేణుగోపాల్
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో…