*రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో జరిగే భారత్ జోడో యాత్రను విజయవంతం చేద్దాం

కొడకండ్ల, అక్టోబర్22 (జనంసాక్షి)
కొడకండ్ల మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో కొడకండ్ల మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ రేపు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జూడో యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ మక్తల్ నుండి ప్రారంభం కానుంది. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుయాత్రలో కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనార్టీ సెల్ యువజన విభాగం, మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె ముంతల సోమ నరసయ్య, పట్టణ అధ్యక్షులు మసూరం రవీందర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మండల బీసీ సెల్ అధ్యక్షులు వల్లబోజు రమేష్ కొడకండ్ల గ్రామ యూత్ అధ్యక్షులు మసురం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.