రేపు గోండి మాతృభాష దినోత్సవం

జైనూరు, న్యూస్‌టుడే: మండలంలోని చారిత్రాత్మక గ్రామం మార్లవాయిలో ఈనెల 21న గోండి మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నట్లు రాయిసెంటర్‌ జిల్లా సార్‌మెడి మెస్రం దుర్గు అన్నారు. మంగళవారం ఆయన మండల

కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయిసెంటర్ల(గిరిన్యాయస్థాన)ను పటిష్ఠపర్చడంతో పాటు గోండి లిపి ఆవశ్యకతపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి గోండి భాష లిపి అధ్యయన వేదిక అధ్యక్షుడు జయదీర్‌ తిరుమల్‌ రావు. ముఖ్య అతిథులుగా జూలురి గౌరిశంకర్‌ (విద్యావేత్త). జిల్లా సాహితివేత్తలు గోపిగాని రవీందర్‌, గిరిజన సాహితివేత్తలు మెస్రం మనోహర్‌, ఆర్క మాణిక్‌రావులు హాజరవుతున్నట్లు

చెప్పారు. జైజంగో జైలింగో గన్‌ సంస్థాన్‌ జిల్లా అధ్యక్షుడు ఆనక దేవేందర్‌, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెస్రం మోతీరాం, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కనక వెంకటేశ్వర్‌రావు, మార్లవాయి సార్‌మెడి కనక మారుతి,

ధర్మేందర్‌ తదితరులు పాల్గొన్నారు.