రేవంత్‌ ఓ ఐరన్‌ లెగ్‌: కూకట్‌పల్లి ఎమ్మెల్యే

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): టిడిపిలో రేవంత్‌ రెడ్డి ఓ ఐరన్‌ లెగ్‌ అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. రేవంత్‌ వ్యవహారంపై మాట్లాడుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా టిడిపి అబివృద్దికి తనలాంటి వారెందరో కృషి చేస్తే దానిని రేవంత్‌ భ్రష్టు పట్టించారని అన్నారు.

తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరతుండటంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల మాధవరం టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన

సంగతి తెలిసిందే. రేవంత్‌ కాంగ్రెస్‌లోకి వెళితే ఆ పార్టీకి శనిపట్టినట్లేనంటూ ఆరోపించారు. రేవంత్‌ ఒక ఐరన్‌ లెగ్‌ అని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణలో టీడీపీ నాశనమైందన్నారు. మాలాంటి నేతలు 30 ఏళ్ళపాటు పార్టీని బలోపేతం చేస్తే… రేవంత్‌ వచ్చిన కేవలం ఆరేళ్లలోనే పార్టీని భ్రష్టుపట్టించారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మరీ ముఖ్యంగా రేవంత్‌ తన భాషను మార్చుకోవాలంటూ మాధవరం హితవు పలికారు. కాంగ్రెస్‌ పతనం మరింత తీవ్రం కావడం ఖాయమని అన్నారు.

తాజావార్తలు