రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయాధికారి
దంతాలపల్లి: నరసింహులపేట మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సదస్సుల్లో వ్యవసాయసాగుకు సంబంధించిన అంశాలపై రైతులకు మండల వ్యవసాయాధికారి పి. హరిప్రసాద్ అవగాహన కల్పించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయానుబంధ శాఖరి అధికారులు పాల్గొన్నారు.