రైతులకు డిఎపి ఎరువుల పంపిణి

వినుకొండ, జూలై 31 : జాతీయ ఆహారభద్రత మిషన్‌ పథకం కింద నూజళ్ళ మండలంలోని పలుగ్రామాలకు చెందిన 200మంది రైతులు డిఎపి ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రమేష్‌ పాల్గొని మాట్లాడారు. మండలంలోని రైతులకు 125టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు మంజూరయ్యాయని అన్నారు. ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎఈఓలు అప్పారావు, కరీం రైతులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు