రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ఆళ్లపల్లి జూలై 19( జనం సాక్షి)
రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేసు ఎల్లయ్య అన్నారు మంగళవారం మండల పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… మండలంలో ఇప్పటికే మొక్కజొన్న విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు 20వేల రూపాయలు పత్తి వేసి నష్టపోయిన రైతులకు 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆళ్లపల్లి మండల వ్యాప్తంగా వెళ్లి రోడ్డు మార్గాలు అస్తవ్యస్తంగా మారాయని ,తక్షణమే అధికారులు చర్య తీసుకో చేయాలన్నారు .రైతుల సౌకర్యం కొరకు వాగులు దాటాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని వాటిపై కల్వర్టు లు
 నిర్మించాలని అన్నారు .అదేవిధంగా తెగిపోయిన కుంటలు కొట్టుకుపోయిన అలుగులు వెంటనే వర్షాల వల్ల కూలిన ఇళ్లకు తక్షణ సాయం అందించాలని పెద్ద వెంకటాపురంలో వాగుల్లో కొట్టుకుపోయిన మేకల సంబంధిత రైతుకు త న్యాయం చేయాలని అన్నారు. నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అంచనా వేసి  ప్రభుత్వ నష్టపోయిన రైతులకు వెంటనే ప్యాకేజీలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు
Attachments area