రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై ఎస్మా యాక్ట్ చర్యలు
– అధికారులకు రేవంత్ ఆదేశం
ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రైతులను ఇబ్బందిపెడితే ఎస్మా కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులను వేధిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కలెక్టర్లు కూడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు.