రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది:ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: రైతు బంధు స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జరిగే నగదు బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కీమ్ కింద డబ్బులు రైతులకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రైతు బంధును కాంగ్రెస్ అడ్డుకున్నదని, ఆ స్కీమ్ చాలా ఏళ్ల నుంచి అమలులో ఉందని, ఇప్పటికే అమలులో ఉన్న స్కీమ్‌ను ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ఎంపీ అసద్ ప్రశ్నించారు. ఒకవేళ ఇది కొత్త స్కీమ్ అయి ఉంటే, అప్పుడు దాని గురించి భిన్నంగా ఆలోచించే అవకాశం ఉంటుందని, ఇదేమీ కొత్త స్కీమ్ కాదు అని, అకస్మాత్తుగా ఆ స్కీమ్‌ను అడ్డుకోవడం అంటే, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందని స్పష్టమవుతోందని అసదుద్దీన్ అన్నారు. రైతు బంధును అడ్డుకోవడం అంటే .. కాంగ్రెస్ పార్టీ తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోందని అసద్ ఆరోపించారు.