రైతుల సమస్యలను పరిష్కరించాలి

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధులు కాల్వ సుజాత, చకిలం రాజేశ్వర రావు మాట్లాడుతూ లక్ష రూపాయల రైతు రుణమాఫీ, కౌలు రైతు ,అటవీ హక్కుల చట్టం అమలు చేయాలన్నారు.పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని , ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.24లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదన్నారు.వెంటనే భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 5న ధరణి బాధితులతో కలెక్టరేట్ ముట్టడి చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్ , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు శ్రీనివాస్,పెన్ పహాడ్ మండల అధ్యక్షులు సురేష్ రావు,ఆత్మకూర్(ఎస్) మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు వెంకట నాగిరెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి బాలు గౌడ్, డీసీసీ కార్యదర్శులు రవి, మల్లయ్య, అధికార ప్రతినిధి శేఖర్,జిల్లా సేవాదళ్ చీఫ్ మాణిక్యం, పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షులు శ్రీను ,పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షులు రాంబాబు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి, నాయకులు శ్రీనివాస రావు,వెంకట్ రెడ్డి,సత్యనారాయణ రెడ్డి, శ్రీను, కుమార్ యాదవ్, సైదులు మధు,శివనాయక్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు