రైతు చైతన్య సదస్సులు
దంతాలపల్లి, జనంసాక్షి: నర్సింహులపేట, దంతాలపల్లి గ్రామాల్లో రైతు చైతన్య సదస్సులను మంగళవారం నిర్వహించారు. రాబోవు ఖరీఫ్ సాగులో రైతులు చేపట్టాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌బాబు, రైతులు పాల్గొన్నారు.