రైతు రుణమాఫీ చేయాలని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
మల్దకల్ జులై 17 (జనంసాక్షి)
భారతీయ జనతాపార్టీ,కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు డీకే అరుణమ్మ ఆదేశానుసారం గద్వాల్ నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రoలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు కుర్వ చంద్రయ్య ఆధ్వర్యంలో లక్ష రూపాయల రుణమాఫీనీ ఏక మొత్తంగా వడ్డీ తో సహా అమలు చేయాలని కోరుతూ ఆదివారం రైతులనుంచి సంతకాలు సేకరించడం జరిగింది.2018 అసేంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ముఖ్యమైన హామీ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాయమాటలు నమ్మి రైతులు మోసపోయారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న మెట్ట పంటలు పత్తి కందులు పెసలు మినుములు తదితర పంటలతో పాటు ముందస్తు వరి సాగు చేసిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, నకిలీ విత్తనాలు ఎరువులను క్రిమి సంహారక మందులు తయారు చేసే ముఠాలను కఠినంగా శిక్షించాలని,రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులకు ఎంతో మేలు కలిగించే కేద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పసల్ భీమా యోజన పధకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణా రెడ్డి ,జిల్లా కిసాన్ మోర్చా జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు పాల్వాయి రాముడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ పెద్దోడ్డి రామకృష్ణ ,మండల మాజీ ఎంపీపీ గోవిందు,దామ వెంకటేష్ ,ఎంపీటీసీ లక్ష్మన్న సవారి,మాజీ ఎంపీటీసీ తిమ్మప్ప, యూత్ లక్ష్మి నారాయణ, పవన్ పర్శరాముడు తదితరులు పాల్గొన్నారు