– రైతు సంఘం

చండ్రుగొండ జనంసాక్షి (జులై  21)  :   చంద్రుగొండ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం వెంగళరావు ప్రాజెక్ట్   కుడి కాలవ ను పరిశీలించారు.  ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు పెద్దిని వేణు  విలేఖరులతో  మాట్లాడారు. ప్రాజెక్టు కుడికాల్వ గండి వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. అలుగునిర్మాణ సమస్య ఒక ప్రక్క అయితే మరో ప్రక్క పంట చేలలోకి వెళ్లే కాలువ గండ్లు పడి నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు. చివరన ఉన్న వరి పొలాలకు నీళ్లు అందే పరిస్థితి లేదన్నారు. వెంటనే ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని లేకపోతే రాబోయే రోజుల్లో రైతులందరిని సంఘటితం చేసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు రాయి రాజా. రైతు సంఘం నాయకులు చల్లపల్లి రాజా. బాధిత రైతులు మల్లయ్య ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.జనంసాక్షి (జులై  21)  :   చంద్రుగొండ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం వెంగళరావు ప్రాజెక్ట్   కుడి కాలవ ను పరిశీలించారు.  ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు పెద్దిని వేణు  విలేఖరులతో  మాట్లాడారు. ప్రాజెక్టు కుడికాల్వ గండి వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. అలుగునిర్మాణ సమస్య ఒక ప్రక్క అయితే మరో ప్రక్క పంట చేలలోకి వెళ్లే కాలువ గండ్లు పడి నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు. చివరన ఉన్న వరి పొలాలకు నీళ్లు అందే పరిస్థితి లేదన్నారు. వెంటనే ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని లేకపోతే రాబోయే రోజుల్లో రైతులందరిని సంఘటితం చేసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు రాయి రాజా. రైతు సంఘం నాయకులు చల్లపల్లి రాజా. బాధిత రైతులు మల్లయ్య ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.