రోగగ్రస్త ఆర్ధిక వ్యవస్థకు కేసీఆర్ మార్క్ చికిత్స
` మాంద్యానికి విరుగుడుగా క్యూ ఈ థెరపీ
` ప్రధానికి తెంగాణా సీఎం ప్రతిపాదన
` ఆర్ధిక సంక్షోభ సమయంలో ఆపద్భందు.. ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ ‘హెలికాప్టర్ మనీ’
` అమెరికా, బ్రిటన్, జపాన్ సహా పు దేశాలో ఇప్పటికే వినియోగం
` రాష్ట్రాన్నిటికీ ప్రయోజనం చేకూరేలా సీఎం కెసిఆర్ సూచను
` 5% క్యూఈతో అందుబాటులోకి వస్తే రూ.10 క్ష కోట్ల నిధు
` ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని మూడు నుండి ఐదు శాతానికి పెంచాలి
` రాష్ట్రాు చెల్లించే అప్పును కనీసం ఆరు నెలు వాయిదా వేయాలి
` పీఎం కేర్స్, సీఎంఆర్‌ఎఫ్‌కు సిఎస్‌ఆర్ నిబంధను ఒకే విధంగా ఉండాలి
(దేశ్‌కీనేతకేసీఆర్)
హైదరాబాద్,ఏప్రిల్ 12(జనంసాక్షి):ఇప్పటివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సంక్షోభాను ఎదుర్కొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ సంక్షోభంలోకి వెళ్ళలేదు. ఒకట్రెండు మార్లు సంక్షోభం అంచు వరకు వెళ్ళినప్పటికీ మాజీ ప్రధాను పీవీ, మన్మోహన్ సింగ్, మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ వంటి ఆర్థిక నిపుణు తీసుకున్న పటిష్టమైన చర్య కారణంగా ఇబ్బందు ఏర్పడలేదు. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో పాటు తొలిసారిగా మన దేశ ఆర్థికవ్యవస్థ సంక్షోభం ముంగిట్లో ఉంది. కరోనా వైరస్ అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు అము చేస్తున్న లాక్ డౌన్ ఇప్పటికే ఇరవై రోజు పూర్తి చేసుకుంది, కొన్ని రాష్ట్రాు ఈ నెలాఖరు వరకు పొడిగించాయి. దీనితో వస్తు సేవ రంగం పూర్తిగా స్థంభించింది. ఒకవైపు ప్రభుత్వా ఆదాయం భారీగా తగ్గగా మరోవైపు నిర్వహణా ఖర్చు విపరీతంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం నుండే దేశంలో కనిపిస్తున్న ఆర్థిక మాంద్యపు ఛాయకు ఇప్పుడు లాక్‌డౌన్ ప్రభావం మూలిగే నక్క విూద తాటిపండు పడ్డట్టుగా మారింది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అము జరుగుతున్న తీరు, కరోనా కట్టడికి రాష్ట్రాు తీసుకుంటున్న చర్యు, లాక్ డౌన్ పొడిగింపు తదితర అంశా గురించి అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రు అభిప్రాయాను తొసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియో కాన్ఫరెన్సులో చాలా మంది ముఖ్యమంత్రు తమతమ రాష్ట్రాలో లాక్ డౌన్ అము జరుగుతున్న తీరును వివరించడంతో పాటు ఆయా రాష్ట్రాలో ఉన్న సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం అందించాని కోరారు. అయితే తెంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వాటి పరిష్కారానికి పు ప్రతిపాదను కూడా చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజు బయటకు రాలేని పరిస్థితితో పాటు ప్రభుత్వాకు ఆదాయం తగ్గిన ప్రస్తుత సమయంలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’, ‘హెలికాప్టర్ మనీ’ వినియోగంలోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యు తీసుకోవాని ప్రధానమంత్రిని సీఎం కెసిఆర్ కోరారు. మన పరిభాషలో చెప్పాంటే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు ఆర్బీఐ అదనపు నగదు ముద్రించి నేరుగా ప్రజకు పంపిణీ చేసే విధానాన్ని హెలికాఫ్టర్ మనీ అని, ప్రభుత్వం ద్వారా వినియోగిస్తే క్వాంటిటేటివ్ ఈజింగ్ అని అంటారు. 1929లో ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యం సమయంలో యూరోప్ దేశాతో పాటు అమెరికా హెలికాప్టర్ మనీ విధానాన్ని అము చేసింది. అనంతరం సంభవించిన ప్రపంచ ఆర్థిక మాంద్యం వన 2008 నుండి అమెరికా 9 సంవత్సరాు ఈ విధానాన్ని అము చేసింది. జపాన్ మాత్రం 2016లో హెలికాప్టర్ మనీ విధానం కాకుండా ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ అము పరిచింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సంక్షోభం దిశగా వెళ్తున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అమెరికా ఫెడరల్ బ్యాంకు తమ జీడీపీలో 10 శాతం అంటే 2 ట్రిలియన్ డార్లను, బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ ండన్ ఆ దేశ జీడీపీలో 15 శాతం విడుద చేశాయి. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు రెవెన్యూ, ట్యాక్సు వచ్చే పరిస్థితి లేనందున ఆర్‌బీఐ నుంచి క్యూఈ విధానంలో డబ్బు తీసుకోవాల్సిన పరిస్థితు ఏర్పడ్డాయి. 2019?20కిగాను జీడీపీని నిర్ధారించిన 203.85 క్ష కోట్లలో ఆర్‌బీఐ కనీసం ఐదు శాతం విడుద చేసినా రూ. 10.15 క్ష కోట్లు కేంద్ర, రాష్ట్రాకు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్బీఐ ఏ విధానాన్ని ఎంచుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాతో పాటు ప్రజకు ఎంతో ఉపశమనం కుగుతుంది. ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’, ‘హెలికాప్టర్ మనీ’ విధానాను అము చేయాని కోరడంతో పాటు ద్రవ్య న్వి పరిమితిని ముప్పై నుంచి వంద శాతానికి పెంచాలి, ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని మూడు నుండి ఐదు శాతానికి పెంచాలి, రాష్ట్రాు చెల్లించే అప్పును కనీసం ఆరు నెలు వాయిదా వేయాలి, సిఎస్‌ఆర్ నిబంధను పీఎం కేర్స్, సీఎంఆర్‌ఎఫ్ కు ఒకే విధంగా ఉండాలి, ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి వర్తింప చేయాని సీఎం కెసిఆర్ కోరినారు. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ముంగిట ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కెసిఆర్ ప్రతిపాదించిన అంశాన్నీ యావత్ దేశానికి ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని పువురు ఆర్థిక నిపుణు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందా అని దేశప్రజందరూ ఎదురు చూస్తున్నారు.