రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 23(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఫోర్ట్ రోడ్ లో గల రోటరీ క్లబ్ భవనంలో రోటరీ క్లబ్ వరంగల్ వారు’ నేషన్ బిల్డర్ అవార్డ్స్’ కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించడం జరిగింది.
ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే 20మంది ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయని, ఉపాధ్యాయులను గుర్తించి, ముఖ్య అతిథి శరత్ చౌదరి సమక్షంలో వారికి సన్మానం చేసి సత్కరించడం జరిగింది. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, అంకితభావంతో చేసే ఈ వృత్తి ద్వారా విజ్ఞానం అందిస్తూ.. దేశ పురోగతికి ఎంతో దోహదపడుతుందని పలువురు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు దీకొండ నరసింహా రావు, కార్యదర్శి కుమారస్వామి,రవీందర్, ఎల్ల రాజు, భాస్కర్, రాజగోపాల్, రాజయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు, సుధాకర్, వైద్యనాథ్, ఆనంద రావు, శివ ప్రసాద్, రమేశ్ బాబు, సురేష్, శ్రీకాంత్, కనకయ్య, మన్మోహన్ రెడ్డి, మురళి, కిరణ్ కుమార్, శ్రీనివాస్ తదిరులు రోటరీ సభ్యులు
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారు సన్మానించిన ఉపాధ్యాయులలో మహేందర్, గంగా భవాని, కనకయ్య, చక్రపాణి, రామస్వామి, కృష్ణారావు, వీరకుమార్, అనీల్ కుమార్, సుజాత, దేవి సునీల ప్రభ, ఉమ, రమేష్, అహల్య, సుదర్శన్, ఫారీద్, జయసింగ్, రాములు, సంధ్యారాణి, సుభాషిణి మరియు రమేష్ తదితరులు ఉన్నారు.