రోడ్డును పట్టించుకోరా….? : డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్

పరిగి  రూరల్, అక్టోబర్ 12 (జనం సాక్షి  ) :
ప్రాణాలు పోతున్నా పరిగి – షాద్ నగర్ రోడ్డును బాగు చేయాలనే ఆలోచనల స్థానికి ఎమ్మెల్యేకు రావడం లేదా అంటూ డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్, నాయకులు లాల్ కృష్ణ ప్రసాద్ తప్పుపట్టారు. పరిగి నుంచి షాద్ నగర్ వెళ్లే రోడ్డును బాగు చేయాలని కోరుతూ పరిగిలో షాద్ నగర్ రోడ్డు పై బుధవారం ధర్నా, రాస్తా రోఖో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డును రీబీటీ చేసేందుకు గతంలోనే 4.60 కోట్లు మంజూరయ్యాయని చెప్పి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కావడం లేదంటూ మండిపడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ రోడ్డు పూర్తిగా గుంతలు పడిందన్నారు. గతంలో ఈ రోడ్డుపై గుంతల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినా కనువిప్పు కలుగడం లేదంటూ మండిపడ్డారు. ధర్నా నిర్వహించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ పి.విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.అయినా వినకుండా ధర్నా నిర్వహించారు. ఆర్అంబ్ బీ డీఈతో మాట్లాడి రెండు రోజుల్లో గుంతలు పడిన రోడ్డుపై కంకర వేసి పూడ్చుతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. ఈ ధర్నా, రాస్తారోఖోలో  కాంగ్రెస్ నాయకులు  టౌన్ ప్రసిడెంట్ ఎర్రగడ్డపల్లి కృష్ణ, మున్సిపల్ ప్లోర్ లీడర్ జరుపుల శ్రీనివాస్ పవార్, నాయకులు బద్రిగారి రాజ్ పుల్లా రెడ్డి, మల్లేషం, వెంకటేశ్, బాదం శ్రీనివాస్, నాగవర్ధన్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్  :
12 పిఆర్ జి 03 లో  పరిగి–షాద్ నగర్ రోడ్డులో ధర్నా, రాస్తా రోఖో చేస్తున్న కాంగ్రెస్ నాయకులు