*రోడ్డు నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కలవనున్న సర్పంచులు ఎంపీటీసీల బృందం*

– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు

మునగాల, అక్టోబర్ 10(జనంసాక్షి): అనేక సంవత్సరాల నుండి శిధిలావస్థలో చేరి గుంతలమయమైన మునగాల నుండి కీతవారిగూడెం వరకు గల రోడ్డును నిర్మాణం చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని కోరుతూ ఆర్అండ్బి రోడ్డుపై గల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నేడు జిల్లా కలెక్టర్ ను కలవనున్నట్లు  వారు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు నేటి ఉదయం 10 గంటలకు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలని సూచించారు. అనేక సంవత్సరాలుగా ఆర్అండ్బీ అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, ప్రయాణికులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేయవలసి వస్తుందని వారు అన్నారు. సీఆర్ఎఫ్ నిధులు 20 కోట్లు మంజూరు అయినట్టు అధికారులు చెప్తున్నా.. నేటికీ పనులు ప్రారంభించడం లేదని అన్నారు. మునగాల నుండి   కీతవారిగూడెం వరకు రోడ్డు నిర్మాణం చేసేంతవరకు రాజకీయాలకతీతంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.