రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన గౌడ సంఘం
మండల కేంద్రంలోని అయ్యప్ప పూజకు వెళ్లి వస్తూ గత నెల 12వ తారీకు ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కుటుంబాలకు మునగాల గౌడ సంఘం నుండి ఒక లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సాయం గురువారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, దైవదర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదం జరగటం దురదృష్టమని, ఇలాంటి సంఘటనను మరల జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, క్షతగాత్రులకు దాతృత్వ హృదయంతోటి ముందుకు వచ్చి ఇంకా సహకారం అందించే వారు అందించాలని వారు కోరారు. ప్రమాదంలో మరణించిన గౌడ కులస్తులు ఇద్దరికీ కలిపి 50 వేల రూపాయలు, ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన వారికి లక్ష రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారగాని వెంకయ్య, నారగాని వెంకన్న, గండు అంజయ్య, మామిడి శ్రీనివాస్, బత్తిని చంద్రం, కీర్తి రామస్వామి, కుక్కడపు లక్ష్మయ్య, కొండా రామాంజనేయులు, అనంతుల సత్యం, నారగాని పరుశరాములు, అమరగాని వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీను, మండవ శ్రీను, యరగాని వెంకన్న, నారగాని రాంబాబు, బత్తిని సాయి, కప్పల చంద్రం, అమరగాని శ్రీను, గుండు నాగేశ్వరరావు, దొమ్మేటి శ్రీను, కట్టెకోల బజార్ బాబు, అనంతు భిక్షం, కాసాని వీరయ్య, వత్సవాయి రాము, మండవ శ్రీను, గుండు శ్రీరాములు, గౌడసంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.