రోడ్లకు మోక్షం ఎన్నడో…

నేషనల్ హ్యూమన్ రైట్స్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్
కేసముద్రం ఆగస్టు 7 జనం సాక్షి / తెలంగాణ రాష్ట్రం లో ప్రజలకు అపరిశుభ్ర వాతావరణం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని జిల్లా ఉన్నతాధికారులు మండల అధికారులకు ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించి చెప్పినా కూడా ఎక్కడా వేసిన గొంగళి అక్కడే ఉన్నదన్నట్లుగా అధికారుల తీరు వున్నదని నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసముద్రం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్ అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ… అమీనాపురం గ్రామంలోని కేసముద్రం శివారు మీసేవ కేంద్రం నుండి కిష్టయ్య  బావి వరకు ప్రతీ వర్షాకాలంలో వర్షాలకు మట్టిరోడ్లు దెబ్బతిని వర్షం నీరు నిల్వవుండి పాదాచారులకు ,విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక నెల క్రితం గ్రామపంచాయతీ వారు హడావుడిగా సైడ్ కాల్వ త్రవ్వకం పనులు చేపట్టి మధ్యలోనే అసంపూర్తిగా మట్టిని పూడ్చడం వల్ల గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు,ప్రజాప్రతినిధులు ఈజీఎస్ ,సీడీఎఫ్ ,ఎఫ్ ఎఫ్ సి,ఎస్ ఎఫ్ సి ధ్వారా ఎన్నో కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఇలాంటి రోడ్లను బాగుచేసి వారి పరిపాలన నిజంగా కేసీఆర్ అన్నట్లు బంగారు తెలంగాణ నిర్మాణంలో చూపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.