లంబాడీలను ఎస్టీ,జాబిత నుండి తొలగించాలని డిమాండ్ .

నెరడిగొండఅక్టోబర్ 7(జనంసాక్షి):
 ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని శుక్రవారం రోజున మండల కేంద్రంలో తుడుందెబ్బ అధ్యక్షుడు సంబన్న ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేసి మండల తహసీల్దార్ పవన్ చంద్ర కి మెమొరాండం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందినదని,
చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబిత నుండి తొలగించాలి ఆదివాసులు సాగుచేస్తున్నా అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పేసా 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని
జిఓనెం 3ని యధావిధిగా అమలు చేయాలని గిరిజన యూనివర్సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని
గిరిజన ఆదివాసీ స్పీషల్ డిఎస్సీచేపట్టాలి నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామలుగా గుర్తించాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో ఎఎన్ఎంలను వెంటనే నియమించి ఆదివాసీ విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యలను కాపాడాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ
తుడుందెబ్బ కమిటీ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు జుగ్నక్ సంబన్న డివిజన్ అధ్యక్షుడు తొడసం శంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడప నగేష్ ఆదివాసీ గ్రామ పట్టెలు పాల్గొన్నారు.
Attachments area