లక్ష్మీనరసింహస్వామి సేవలో హరికృష్ణ
మంగపేట: తెదేపా నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నేడు వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని మల్లూరి గుట్టపైగల లక్ష్మీనరసింహాస్వామిని సతీసమేతంగా దర్శించుకొని, తైలాభిషేకం చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు గుట్టకు చేరుకుని చింతామణి జలపాతం సందర్శించారు. ఆలయ పూజారి రాజశేఖరశర్మ, రాఘవచార్యులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన దైవదర్శనం చేసుకుని అభిషేకాలు నిర్వహించారు.