లక్ష్యం దిశగా సర్పంచ్‌లు కృషి చేయాలి
హరితహారంలో మొక్కల పెంపకం జరగాలి
ఆదిలాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : హరిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని నాటిన ప్రతి మొక్కను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. గ్రామ సర్పంచ్‌లు ఈ బాధ్యతలో ముందుండాలన్నారు. గ్రామాలను అభివృద్ది చేసేందుకు వారు ముందుకురావాలన్నారు. ప్రణాలికలో భాగంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టాన్న్రి హరిత తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పచ్చదనంపై దృష్టి పెట్టామన్నారు. సమైక్యాంధ్ర పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదని, పేదల కన్నీరు తుడిచి వారిలో ఆనందం నింపడమే తెలంగాణ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని అన్నారు. హరిత తెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు. పర్యావరణ పరిరక్షణెళి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. చెట్లను నరకటం వలన మానవుని మనుగడ
ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. ఐదోవిడత హరితహారంలో కూడా గ్రామాల్లోఅత్యధిక మొక్కలు నాటుతున్నారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటటంతోపాటు వాటిని సంరక్షించాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక భాద్యతగా హరితవిప్లవం చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిఇంట్లో రెండు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారంజక పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు.